బ్లాక్ ఫంగ‌స్ ఎఫెక్ట్ : రాష్ట్రాల‌కు ఐసీఎంఆర్ కీల‌క ఆదేశాలు

-

ఏడాది కాలం త‌ర్వాత మరో సారి బ్లాక్ ఫంగ‌స్ కేసు వెలుగు చుడ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం, ఐసీఎంఆర్ అప్ర‌మ‌త్తం అయ్యాయి. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాల‌కు ఐసీఎంఆర్ కొత్త ఆదేశాల‌ను జారీ చేసింది. క‌రోనా సోకిన వారికి ఇచ్చే చికిత్స కు సంబంధించి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఐసీఎంఆర్ విడుద‌ల చేసింది. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగ‌స్ కేసు వెలుగు చుడ‌టంతో ఇప్పుడు ఉన్న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌వ‌రించి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. వీటి ప్ర‌కారం కరోనా సోకిన వ్య‌క్తికి చికిత్స స‌మ‌యంలో స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఇవ్వ‌ద్ధ‌ని రాష్ట్రాల‌కు ఐసీఎంఆర్ సూచించింది.

క‌రోనా రోగి స్టెరాయిడ్స్ అధిక మోతాదు లో ఇవ్వ‌డం వ‌ల్ల బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించింది. బ్లాక్ ఫంగ‌స్ తోపాటు ఇత‌ర సెకండ‌రీ ఇన్పెక్ష‌న్లు కూడా సోకే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపింది. అలాగే క‌రోనా సోకిన వ్య‌క్తుల‌కు రెండు నుంచి మూడు వారాల పాటు ద‌గ్గు ఉంటే టీబీ వంటి ప‌రీక్ష‌లు చేయాల‌ని ఐసీఎంఆర్ సూచించింది. ఎక్కుడ కూడా బ్లాక్ ఫంగ‌స్ కేసులు రాకుండా జ‌గ్ర‌త్త ప‌డాల‌ని తెలిపింది. కాగ గ‌త ఏడాది వ‌చ్చిన సెకండ్ వేవ్ లో బ్లాక్ ఫంగ‌స్ ద్వారా చాలా మంది మ‌ర‌ణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version