దేశంలో రోజూవారీ కరోనా కేేసులు మూడు లక్షలకు చేరువ అవుతున్నాయి. చాపకింద నీరులా కోవిడ్ కేసులు విస్తరిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి రోజూవారీ కేసుల సంఖ్య లక్ష, రెండు లక్షలను దాటి మూడు లక్షలకు చేరువ అయింది. తాజాగా ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఇండియాలో గడిచిన 24 గంటల్లో 2,82,970 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 44,889 ఎక్కువ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 441 మరణాలు సంభవించగా.. 1,88,157 మంది రికవరీలు అయ్యారు.
దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000 ఉండగా… పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదయ్యాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కు చేరింది. నిన్నటితో పోలిస్తే 0.79 శాతం కేసులు పెరిగాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు, నైట్ కర్ప్యూలు విధిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 2500 దాటింది.