మూడో నెలలో బ్లీడింగ్‌ అవుతుందా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

-

పెళ్లైన వారికి పిరియడ్స్‌ అగిపోతే గర్భందాల్చామనే అనుకుంటారు. అందుకు తగ్గట్టు ఇంటి దగ్గరే ఉండి టెస్ట్‌ కూడా చేసుకుని కన్ఫామ్‌ చేసుకుంటారు. కానీ గర్భం దాల్చిన మూడో నెలల్లో మళ్లీ బ్లీడింగ్‌ అవుతుంది.. చాలామంది మహిళల్లో గర్భం దాల్చిన రెండు మూడు నెలలకు ఇలా బ్లీడింగ్‌ అవుతుంది. అప్పుడు మళ్లీ వెంటనే ఆందోళన మొదలవుతుంది. ప్రెగ్నెసీకి ఏమైనా ఇబ్బంది ఉందా అని టెన్షన్ పడుతుంటారు..? అసలు ఇలా ఎందుకు అవుతుంది..? ఇలా బ్లీడింగ్ అవడం అనేది మంచిదేనా..ప్రమాదమా..?

గర్భం ధరించిన తర్వాత రుతుస్రావం (బ్లీడింగ్‌) కావటం మంచిది కాదు. దీని అర్థం.. గర్భధారణ ప్రక్రియ సరైన పద్ధతిలో సాగటం లేదనే. అలాగని అతిగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. గర్భధారణ తర్వాత అప్పుడప్పుడు రుతుస్రావం కనిపించటం తరచూ చూసేదే. తొలి త్రైమాసికంలో సుమారు 15-25% మందిలో బ్లీడింగ్‌ అవుతుందట..చాలామందిలో ఇదేమీ పెద్ద ప్రమాదకరం కాదు. దానంతటదే తగ్గిపోతుంటుంది. అయితే బ్లీడింగ్‌కు కారణమేంటన్నది తెలుసుకోవటం ముఖ్యం. కొన్ని కారణాలను సరిచేయొచ్చు. అలాగే కొన్నింటిని సరిచేయలేమని నిపుణులు అంటున్నారు.

ఫలదీకరణ చెందిన అండం గర్భసంచి గోడలో కుదురుకునే సమయంలో తొలి రెండు వారాల్లో కొందరికి బ్లీడింగ్‌ కావొచ్చు. గర్భధారణ తొలిదశలో గర్భాశయ ముఖ ద్వారంలో రక్తనాళాలు పెద్ద సంఖ్యలో వృద్ధి చెందుతుంటాయి. అందువల్ల తేలికగా రక్త స్రావమయ్యే అవకాశముంది. హార్మోన్ల సమతుల్యత అస్తవ్యస్తం కావటం వంటి మామూలు సమస్యలతోనూ రుతుస్రావం అవుతుంది.. ఏదేమైనా..ఇలా బ్లీడింగ్ అవుతుంటే మాత్రం గైనకాలజిస్టును సంప్రదించి, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోవటం ఉత్తమం. దీంతో గర్భసంచిలోనే గర్భధారణ జరిగిందా? ఫలోపియన్‌ గొట్టాల్లోనా? అనేవి తెలుస్తాయి.

సాధారణంగా ఫలోపియన్‌ గొట్టంలో గర్భధారణ జరిగినప్పుడు బ్లీడింగ్‌తోనే బయటపడుతుంటుంది. పిండం సైజు, గుండె కొట్టుకునే వేగం, గర్భసంచిలో ఎక్కడైనా రక్తం గడ్డలు ఉండటం వంటివీ స్కానింగ్‌లో తెలుస్తాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉండి, గుండె కొట్టుకునే వేగం బాగుంటే ఏమీ కాదు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటే హార్మోన్ల మాత్రలు సూచిస్తారు.

ఒకవేళ పాలిప్స్‌, గర్భాశయ ముఖద్వారంలో ఏదైనా పెరగటం వంటివి కారణమవుతుంటే సరిచేస్తారు. అయితే..రక్తస్రావం ఆగటానికి అనవసరంగా మందులు వేసుకోకపోవటం వంటివి చేస్తే.. కొన్నిసార్లు బిడ్డకు హాని చేయొచ్చు. మందులతో బయటికి రక్తస్రావం కావటం ఆగిపోయినా లోపల సమస్య అలాగే ఉంటుంది. కాబట్టి మందుల విషయంలో జాగ్రత్త అవసరం. బ్లీడింగ్‌ మరీ ఎక్కువగా అవటం, గడ్డలు గడ్డలుగా రక్తం పడటం, తీవ్రమైన నొప్పి రావటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించండి.
Attachments area

Read more RELATED
Recommended to you

Exit mobile version