ఈ అలావాట్లుంటే మెదడులో రక్తం గడ్డకడుతుందట..జాగ్రత్త..! 

-

మనిషి డబ్బు ఇచ్చి దేన్నైనా కొనొచ్చు అనుకుంటాడు. కానీ కొన్ని ఎంత ఖర్చుపెట్టినా రావు. అందులో ఒకటి ప్రేమ అయితే మరొకటి ఆరోగ్యం. వీటిని కొనగలితే ఈ భూమ్మీద నేరాలు, మరణాలు ఉండవేమో కదా. మన వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమ ఆధారపడితే..మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్కసారే కదా అని అలవాటు చేసుకునే ఎన్నోవాటివల్ల మనకు రకరకాల వ్యాధులు వస్తుంటాయి. కొన్ని చెడుఅలవాట్ల వల్ల బ్రెయిన్ స్టోక్ కూడా వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు. ఆ అలావాట్లేంటి. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలేంటి మనం తెలుసుకుందాం.

బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణాలు..

బ్రెయిన్‌లో బ్లడ్ సప్లైకి ఇబ్బంది అయినప్పుడు ఇది వస్తుంది. అయితే బ్రెయిన్ టిష్యూలులోకి ఆక్సిజన్ కానీ పోషక పదార్థాలు కానీ అందలేదు అంటే స్ట్రోక్ సమస్య వస్తుంది. చాలా మంది ఫాలో అయ్యే పద్ధతుల్లో తప్పులు ఉన్నాయి. వాటి వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాంటి అలవాట్ల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని.. ప్రతీ ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణలు.

కాంట్రాసెప్టివ్ పిల్స్ :

వీటిని తీసుకోవడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆ గండం నుండి గట్టం ఎక్కొచ్చేమో కానీ దాని వల్ల చాలా సమస్యలు వస్తాయి. వీటిని వాడటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా ఈ మధ్యే మనలోకంలో ఒక ఆర్టికల్ ప్రచురించబడింది. ఆసక్తి ఉన్న వారు ఓసారి చూడండి. ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వలన స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుందట.

​సరైన జీవన విధానం లేకపోవటం

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఉండడం, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడం వల్ల స్ట్రోక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారుస ఇలా చేయటం వల్ల స్ట్రోక్ ఒక్కటే కాదు..అన్ని రకాల అనారోగ్య సమస్యలుకు మూలకారణం సరైన జీవన విధానాన్ని పాటించకపోవటం..జెండర్ బయాస్ లేకుండా ఇద్దరికి వస్తుందట.

స్మోకింగ్:

ఈరోజుల్లో ఆడమగ అని తేడాలేకుండా చాలావరకూ అందరూ స్మోకింగ్ చేసేస్తున్నారు. దీనికి కారణం పెరుగుతున్న పాశ్చత్య సంస్కృతా లేక ఒకసారి తాగి చూద్దాం ఎలా ఉంటుందో అని ఇలా ప్రయోగాలు చేయటానికి కూడా స్మోకింగ్ చేస్తున్నారు. ఎక్కువశాతం అమ్మాయిలతో సినిమాల్లో స్టైల్ గా తాగటం చూసి తాము ఓసారి ట్రైల్ వేద్దాం అనుకుని దానికి అలవాటైపోతున్నారు. వాళ్లకి తెలుసు స్మోకింగ్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అని అయినప్పటికీ మానరు. దీనివల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి.

​ఆల్కహాల్ తీసుకోవడం :

మద్యంప్రియుల్లో కూడా స్ట్రోక్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రోజుకి రెండు పెగ్గుల కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మద్యపానానికి దూరంగా ఉండకతప్పుదు.

ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం:

చాలామంది ఫిజికల్ యాక్టివిటీ అంటే పెద్దగా చేయరు. దానివల్లే కదా ఒబిసిటీ సమస్య కూడా. వ్యాయామం చేయాలి అని ప్రతిఒక్కరికి ఉంటుంది కానీ రేపు చేద్దాంలే, వచ్చే వారం నుంచి మొదలుపెడదాం లేని అని కొందరు టైం వేస్టే చేసేస్తూనే ఉంటారు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే చాలా రోగాలను దూరంపెట్టినట్లే. శారీరిక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి కూడా వ్యాయామం ఎంతగానో సహాయపడుతుంది.
మీ సమయంలో కాస్త ఫిజికల్ యాక్టివిటీ పై కేటాయించడం చాలా ముఖ్యం. అలానే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సరిపడా నీళ్లు తాగడం లాంటివి చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఏమైనా చేయగలం..ఒక్కసారి సమస్యలు రావటం మొదలైతే చేయాలనుకున్నా ఏమీ చేయలేం. కాబట్టి మంచిగా ఉన్నప్పుడో ఆరోగ్యం చెడకుండా చూసుకోండి.

బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కలిగే ప్రమాదాలు :

బ్రెయిన్ స్ట్రోక్ సమస్య రావడం వల్ల హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, డయాబెటిస్, ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. ఇవి ఒక్కసారి వచ్చాయంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం.
ఇదండి సంగతి. బ్రెయిన్ స్టోర్ కూడా హాట్ ఎటాక్ అంత ప్రమాదమే. కాబట్టి పైన అలవాట్లు మీకుంటే వాటిని మానేయటం ఎలాగో మనవాళ్ల కాదనుకోండి. కనీసం వాటిని తగ్గించటానికి ప్రయత్నించండి.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version