రఘురామ మళ్ళీ నరసాపురంలోనే….పోటీ ఆ పార్టీ నుంచే?

-

రఘురామకృష్ణంరాజు…. వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి….అదే పార్టీకి పెద్ద ప్రతిపక్షం మాదిరిగా తయారయ్యారు. అసలు గెలిచిన కొన్ని రోజుల నుంచే జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం గుప్పించడం మొదలుపెట్టారు. ప్రతిపక్షాల కంటే ఎక్కువగా రఘురామ, జగన్‌ని టార్గెట్ చేశారు. అయితే వైసీపీ, రఘురామల మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో కూడా తెలిసిందే. రఘురామ వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఆరోపిస్తూనే ఉంది.

సరే రఘురామ-వైసీపీల మధ్య జరిగే వార్‌ని పక్కనబెడితే….నెక్స్ట్ రఘురామ రాజకీయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ ఆయన వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగే పని కాదు…. అది క్లియర్. మరి రఘురామ టి‌డి‌పి నుంచి మళ్ళీ నరసాపురం పార్లమెంట్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే చెప్పొచ్చు. అసలు గత ఎన్నికల్లో రఘురామ టి‌డి‌పి తరుపున బరిలో దిగాలి… కానీ చివరి నిమిషంలో వైసీపీలోకి జంప్ చేసి ఎంపీగా గెలిచేశారు.

కానీ ఈ సారి ఖచ్చితంగా టి‌డి‌పి తరుపున బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి తరుపున పోటీ చేసి రఘురామపై ఓడిపోయిన వేటూకూరి శివరామరాజు…. ఈసారి ఉండి అసెంబ్లీలో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో రఘురామకు నరసాపురంలో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది. కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..టి‌డి‌పి-జనసేనలు పొత్తు ఉంటే మాత్రం…నరసాపురం ఎంపీ సీటు జనసేనకు దక్కుతుంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టి‌డి‌పి పొత్తులో భాగంగా నరసాపురం సీటు బి‌జే‌పికి దక్కింది.

ఇప్పుడు జనసేనతో పొత్తు ఉంటే టి‌డి‌పి…నరసాపురం సీటుని ఆ పార్టీకే ఇచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు రఘురామ…జనసేన బీఫామ్ తీసుకుని పోటీ చేసే అవకాశం ఉంది. పైగా గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు ఓట్లు బాగానే పడ్డాయి. ఇక టి‌డి‌పి-జనసేనలు గెలిస్తే….మళ్ళీ తన విజయానికి ఎలాంటి ఢోకా లేదని రఘురామ భావిస్తున్నారు. చూడాలి మరి ఈ సారి రఘురామ రాజకీయం ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version