ఆకాశంలో అద్భుతాలకు కొదవే లేదు. అందునా నిండు చంద్రుడు కాంతులీనుతుంటే ఇక చూసి ఆహా అనడం మనవంతే అవుతుంది. పూర్ణచంద్రుడు బ్లూ మూన్‌గా ఇవాళ కనువిందు చేస్తున్నాడు. అంటే చందమామ మొత్తం నీలంరంగులో కనిపిస్తాడని కాదు. రోజూ మనం చూసే వర్ణంలోనే ఉంటాడు. కాని ఈ రోజు కాస్త పెద్దగా ఎక్కువ ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు. ఇలా భారీ సైజులో ఏడాదికి 12 సార్లు కనిపిస్తాడు చంద్రుడు. ఇవాళ రాత్రి ఎనిమిది గంటలా 15 నిమిషాలకు బ్లూ మూన్ పూర్తి ప్రకాశవంతంగా ఉంటుంది. అలానే చంద్రుడి పక్కన ప్రకాశవంతమైన మార్స్‌ను కూడా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏడాదికి 12సార్లు కనిపించే పూర్ణ చంద్రుడికి ఒక్కో పేరు పెట్టారు.
బ్లూ మూన్ వెనుక మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. సాధారణంగా సంవత్సరంలో 12 సార్లు పూర్ణ చంద్రుడు దర్శనమిస్తాడు. చంద్రుడు 12 పౌర్ణమిలను పూర్తి చేయడానికి 354 రోజులు పడుతుంది. సంవత్సరంలో మిగిలిపోయిన రోజులన్నింటినీ ప్రీ రెండున్నర సంవత్సరాలకు ఒకేసారి కలుపుతారు. ఫలితంగా ఒక ఏడాదిలో 13 పూర్ణ చంద్రులు కనిపిస్తారు. అదనపు పౌర్ణమి అరుదైన సంఘటన కాబట్టి బ్లూ మూన్‌గా నామకరణం చేశారని చెప్తుంటారు. బ్లూ మూన్‌ను చాలా దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు. చలికాలం మొదలు అవ్వడానికి ముందే నిశాచర జంతువులను వేటాడటానికి వేటగాళ్లకు ఈ పౌర్ణమి బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని హంటర్ మూన్ అని కూడా పిలుస్తుంటారు.