IPL 2023 : గుడ్‌న్యూస్ చెప్పిన గంగూలీ..క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే!

-

ఐపీఎల్ ఫ్యాన్స్‌ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ శుభవార్త చెపక్పారు. ఐపీఎల్ 2023 సీజన్ ని ఏ ఫార్మాట్ లో నిర్వహించబోతున్నారో భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తాజాగా వెల్లడించాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 2020, 2021 సీజన్ మ్యాచ్ లు చాలా వరకు యూఏఈ వేదికగా జరిగాయి.

ఐపీఎల్ 2022 మ్యాచ్ లు భారత్ లోనే జరిగిన, కేవలం ముంబై, పూణే, కోల్కతా, అహ్మదాబాద్ రూపంలో నాలుగు వేదికలకే పరిమితం చేశారు. కానీ, ఐపీఎల్ 2023 సీజన్ మాత్రం మునుపటి ఫార్మాట్ లో నిర్వహించబోతున్నట్లు గంగూలీ స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో అన్ని జట్లు సగం మ్యాచులు సొంత గడ్డపై, మిగిలిన సగం మ్యాచులు ప్రత్యర్థి జట్ల సొంతవేదికలపై ఆడనున్నాయి. ఈ ఫార్మాట్ పాతదే కానీ, గత మూడేళ్లుగా కరోనా కారణంగా అది సాధ్యపడలేదు అని గంగూలీ వెల్లడించాడు. వచ్చే ఐపీఎల్‌ మాత్రం… పాత పద్దతి ఉంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version