బోధన్ లో తీవ్ర ఉద్రిక్తత, 144 సెక్షన్ అమలు … శివాజీ విగ్రహం ఏర్పాటుతో ఇరువర్గాల మధ్య ఘర్షణ

-

నిజామాబాద్ జిల్లా బోధన్ లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బోధన్ లో శివాజీ విగ్రహం ప్రతిష్టించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, శివసేన నాయకులు రాత్రికి రాత్రి ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీన్ని మరోవర్గం నాయకులు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగే వరకు వెళ్లారు. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. నిజామాబాద్ పోలీసులుతో సహా, కామాారెడ్డి, నిర్మల్ నుంచి అదనపు బలగాలు బోధన్ కు చేరుకున్నాయి. స్వయంగా నిజామాబాద్ సీపీ నాగరాజు పరిస్థితిని సమీక్షించారు. బోధన్ లో 144 సెక్షన్ అమలు చేశారు. ఇతరులు బోధన్ లోకి రాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ముందస్తుగా పోలీసులు కొంతమంది బీజేీపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఇరు వర్గాల నాయకులుకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే విగ్రహాన్ని తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తుండగా…విగ్రహాన్ని తొలగించేది లేదని బీజేపీ, శివసేన కార్యకర్తలు భీష్మించుకుని ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version