సీఎం కేసీఆర్ మదిలో ఇప్పుడు బొజ్జా తారకం.. అందుకే రాహుల్‌కు ప్రమోషన్?

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాజకీయ వ్యూహకర్తగా మొదటి నుంచి పేరుంది. ఈ క్రమంలోనే ఆయన ఏ పథకం ప్రారంభించినా, దానిపైన చర్చ జరగాలని కోరుకుంటారు. అందుకు తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ‘రైతు బంధు, బీమా, గొర్రెల పంపిణీ’ ఇతర స్కీమ్స్ ప్రారంభం సందర్భంలో సభలు నిర్వహించి జనంలో చర్చ జరిగేలా చేశారు. తాజాగా ‘దళిత బంధు’ లాంచింగ్ సభ కూడా ఘనంగా నిర్వహించిన సీఎం కేసీఆర్ దాని గురించి విస్తృతంగా చర్చ జరిగేలా చేశారు. అయితే, ఈ స్కీమ్ ఎన్నికల కోసమేనన్న ప్రతిపక్షాల విమర్శలను తాను ముందుగానే ఒప్పుకున్నాడు. రాజకీయ లబ్ధికోసమే పథకాన్ని రూపొందించినట్లు ప్రకటించారు.

cm kcr | సీఎం కేసీఆర్

ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికలో దళితుల ఓట్లు అధికార టీఆర్ఎస్ పార్టకే పడాలని భావించారు కేసీఆర్. ఈ క్రమంలోనే ‘జై భీమ్’ నినాదం ఎత్తుకున్న కేసీఆర్‌కు ప్రముఖ న్యాయవాది, హక్కుల నేత దివంగత బొజ్జా తారకం గుర్తుకు వచ్చారు. ఆయన కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ రాహుల్ బొజ్జాను సీఎంవో కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ సీఎంవోలో మొదటి దళిత అధికారిగా ఉండబోతున్నారు. ఈ క్రమంలోనే బొజ్జా తారకం గురించి చర్చ జరుగుతున్నది. ఏడే ళ్ల పాటు ఆయన ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్న మేధావుల నుంచి వస్తున్నది. మానవ హక్కుల గురించి తన ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేసిన బాలగోపాల్ కేసీఆర్‌కు ఎందుకు గుర్తుకు రావడం లేదని కొందరు అడుగుతున్నారు.

మేధావుల్ని తన రాజకీయ ఎజెండాకు అనుగుణంగా వాడుకునేందుకుగాను సీఎం కేసీఆర్ బొజ్జా తారకం ప్రస్తావన తెచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ మొదటి నుంచి కూడా చాలా మందిని రాజకీయ అవసరాలకు, లబ్ధికి వాడుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రజా కవి, వాగ్గేయకారుడైన గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్, ఇప్పుడు ‘దళిత బంధు’స్కీమ్ కోసమై ఆయన చేత పాటలు రాయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version