Bollywood: ఒకేసారి మూడు చిత్రాలు ప్రకటించే పనిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్…..

-

 

ఇటీవల రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం డంకి. ఈ చిత్రంకి బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి వసూళ్లను రాబట్టింది. అంతకుముందు ‘పఠాన్’తో 1000 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ఆ వెంటనే తమిళ దర్శకుడు అట్లి దర్శకత్వంలో ‘జవాన్’తో వచ్చిన ఈ సినిమా 1100 కోట్లతో సంచలనం సృష్టించింది.  ప్రస్తుతం షారుఖ్ సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు.

 

అయితే గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన షారుఖ్ మాత్రం ఈ ఏడాది ఒకేసారి మొత్తం మూడు ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మూడు ప్రాజెక్ట్స్ కూడా డిఫరెంట్ జోనర్స్ లో ఉంటాయని సమాచారం. ఇందులో ఒక మూవీ పూర్తి యాక్షన్ తో వస్తుండగా మరో చిత్రం మాత్రం ‘డంకీ’ మాదిరి ఫీల్ గుడ్ తో మెసేజ్ ఓరియంటెడ్ గా రానుంది. ఈ నెలాఖరికి ఈ ప్రాజెక్టు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version