కేసీఆర్ బయటికి వచ్చాక ఫస్ట్ మీటింగ్ మీతోనే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

-

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభ పార్టీ తరపున ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటామని చెప్పారు.

హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీలు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పార్టీని పునర్ వ్యవస్థీకరించాలని అధ్యక్షులు భావిస్తున్నారని చెప్పారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివ్ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version