మరక కూడా మంచిదేలే ఓ యాడ్‌లో పాపులర్ అయిన ఈ డైలాగ్ వింటే రకుల్ గుర్తుకొస్తుంది. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు వినిపించింది. ఇందులో నిజం లేదని తేలినా. ఆ మరక మాత్రం అలా వుండిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్‌పై పడిన ఈ డ్రగ్స్ మరకను బాలీవుడ్డే చెరిపేసింది.
రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగులో సక్సెస్ కోసం నిరీక్షించి అలసిపోయింది. ఈలోగా ఐరెన్‌ముద్ర పడినా.. లైట్‌గా తీసుకుంది. తెలుగులో స్టార్స్‌తో జత కట్టే ఛాన్స్ లేకపోయినా.. క్రిష్ సినిమాలో వైష్ణవ్ తేజ్ వంటి కొత్త హీరోతో.. చెక్ మూవీలో నితిన్ వంటి యంగ్ హీరోతో ఎడ్జెస్ట్ అయింది. ఇంతకంటే మించి క్రేజ్ రకుల్‌కు దక్కింది. సౌత్ హీరోయిన్స్ త్రిష.. హన్సిక హిందీలోకి అడుగుపెట్టినా.. ఒకట్రెండు సినిమాలకే పరిమితమయ్యారు. కానీ రకుల్ త్రం అక్కడ తిష్ట వేసేసింది.
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు హిందీ సినిమాలున్నాయి. రకుల్ తెలుగులో ఫేడౌట్ అయినా.. బాలీవుడ్‌లో మాత్రం క్రేజీ హీరోయిన్నే. రకుల్ ఆరేళ్ల క్రితం ‘యారియన్’ అనే మూవీతో హిందీ అడుగుపెట్టింది. డెబ్యూ మూవీతోపాటు.. రెండో సినిమా ‘అయ్యారే ‘ కూడా ఫ్లాప్ అయింది. అయితే.. అజయ్ దేవగణ్‌తో నటించిన ‘ దే దే ప్యార్ దే’ హిట్ కావడంతో.. బాలీవుడ్‌కు దగ్గరైంది రకుల్. ఆతర్వాత అక్కడ వరుస మూవీస్ చేస్తూ… త్వరలో అమితాబ్‌లో కలిసి నటించే చాన్స్ కొట్టేసింది. దే దే ప్యార్ దే అంటూ అజయ్ తో రొమాన్స్ చేసిన రకుల్ మరో ఛాన్స్ కొట్టేసింది.
అజయ్ దేవగణ్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ మూవీ ‘మేడే’లో రకుల్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్లో అమితాబ్‌తో కలిసి నటిస్తోంది రకుల్. రకుల్‌ను ఇక తెలుగు హీరోయిన్‌గా చూడాల్సిన పనిలేదు. వరుస ఛాన్సులతో బాలీవుడ్ భామగా మారిపోయింది. ‘ఎటాక్’ మూవీలో జాన్ అబ్రహాంతో కలిసి నటిస్తోంది. ‘సిమ్లా మిర్చి’లో హేమమాలిని కూతురుగా.. రాజ్‌కుమార్‌రావ్‌తో జత కడుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని.. జనవరి 3న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సర్దార్ అండ్ గ్రాండ్‌సన్ అనే మూవీ చేతిలో వుంది. తాజాగా.. అజయ్ దేవగన్ ఆశీస్సులతో ‘మేడే’లో బిగ్‌బితో నటిస్తూ.. బిగ్ ఛాన్స్ అందుకుంది రకుల్.