కాంగ్రెస్ ను ఓడించేందుకు  బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు : సీఎం రేవంత్ రెడ్డి

-

నిజామాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన్ రెడ్డి గతంలో ఈ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్ ను ఓడించేందుకు  బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ కి అభ్యర్థే దొరకలేదన్నారు. కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించారు.

ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా నరేందర్ రెడ్డి నిలబడుతారు. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నాయి. 2023 డిసెంబర్ లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల తరువాత 8 నెలలే పాలన కొనసాగించాం. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేసాయి. ఈ ఎన్నికల్లో కూడా అలాగే కుట్రలు చేయాలని చూస్తున్నాయి. 50వేల ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతే మాకు ఓటు వేయండి.. లేకుంటే వేయకండి అని గ్రాడ్యుయేట్స్ కి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version