మ‌హేష్ బాబు సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి!

-

టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక ప్ర‌ధాన పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి న‌టిస్తున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో, సినీ ప‌రిశ్ర‌మ‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. అయితే దీని పై ఇప్ప‌టి వ‌ర‌కు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఒక కీలక పాత్ర‌లో న‌టించ‌న్నార‌ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని స‌మాచారం.

అయితే మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమా షూటింగ్ వ‌చ్చే నెల‌లోనే షూటింగ్ ప్రారంభిస్తార‌ని స‌మాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లామ‌ర‌స్ బామ పూజా హెగ్డే ను చిత్ర బృందం ఎంపిక చేసింది. కాగ ప్రిన్స్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబో లో దాదాపు 11 సంవ‌త్స‌రాల త‌ర్వాత సినిమా వ‌స్తుంది. గ‌తంలో వీరి కాంబో లో 2005 లో అత‌డు, 2010 లో ఖ‌లేజా సినిమాలు వ‌చ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version