Hindenburg Research Founder Nathan Anderson: హిండెన్ బర్గ్ అధినేత నాథన్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ కంపెనీని మూసివేస్తున్నట్లు నాథన్ అండర్సన్ ప్రకటన చేశారు. గతంలో గౌతమ్ ఆదానీకి భారీ నష్టాలు తీసుకొచింది హిండెన్ బర్గ్ నివేదిక. అయితే తాజాగా అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ కంపెనీని మూసివేస్తున్నట్లు నాథన్ అండర్సన్ ప్రకటన చేశారు.
ఈ నిర్ణయం భయం, వ్యక్తిగత సమస్యలు లేదా ఆరోగ్య సమస్యల వల్ల తీసుకోలేదని అండర్సన్ స్పష్టం చేశారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2017లో అండర్సన్ చేత స్థాపించబడింది. హిండెన్ బర్గ్ నివేదికలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 2022 , 2024లో భారతదేశంకు చెందిన అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని దాని నివేదికలు ఇచ్చింది హిండెన్ బర్గ్. దింతో అదానీ తీవ్ర పరిణామాలు ఎదురుకొన్నారు.