సుశాంత్ ది ఆత్మహత్య కాదు, అది సాధ్యం కాదు: బాలీవుడ్ సింగర్

-

బాలీవుడ్ స్టార్ సింగర్ కైలాష్ ఖేర్ ఇటీవల ఒక కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయనను స్టార్ జంట పల్లవి జోషి మరియు వివేక్ అగ్నిహోత్రి హోస్ట్ లు గా వ్యవహరించే ది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఫెస్టివల్ చాట్ షోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కైలాష్ చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ మాఫియా ఉనికి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. అతను మాట్లాడుతూ… ఇక్కడి ప్రజలకు వారికి సంగీతం గురించి తక్కువ అవగాహన ఉన్నందున ఎదుటి వారిని అవమానిస్తారని ఆరోపించాడు.

ఈ కారణంగా, వారు తమ హోదాను చూపించడానికి మంచి గాయకుడిని అవమానిస్తారని… నేను కూడా అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన రహస్యం గురించి వివేక్ కైలాష్ ని అడగగా… ఇక్కడ ఎక్కువగా ప్రతిభ దోపిడీ ఉంటుందని వ్యాఖ్యానించాడు. “సుశాంత్ గురించి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోతున్నాను. ఒకరిని జీవించడం నేర్పించే వ్యక్తి, తన ప్రాణాలను ఎలా తీసుకుంటాడు? అది సాధ్యం కాదని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version