టాలీవుడ్ స్టార్ హీరోల కోసం బాలీవుడ్ ఎదురు చూపులు…?

-

గత కొన్నేళ్ళు గా టాలివుడ్ హీరోల మార్కెట్ అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. స్టార్ హీరోలు అందరూ కూడా దాదాపు వంద కోట్ల వసూళ్లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు అందరూ అగ్ర దర్శకులతో సినిమాలు చేస్తూ తమ మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వసూళ్ళ మీద తమ స్టార్ ఇమేజ్ తో దృష్టి పెట్టడం ఈ మధ్య మనం ఎక్కువ చూస్తున్నాం. ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు.

దీనితో వారితో సినిమాలు చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల నుంచి టాలివుడ్ సినిమా మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన బాలివుడ్ నిర్మాతలు ఇక్కడి హీరోలకు తగిన విధంగా కథలు రాయించుకుని మరీ సినిమాలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం టాలివుడ్ దర్శకులతో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా కొరటాల శివ, సుజిత్, రాజమౌళి, వంశీ పైడపల్లి వంటి దర్శకులతో చర్చలు జరుపుతున్నారు.

క్రిష్ ఇప్పటికే బాలివుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయనతో సినిమా చేయడానికి బాలివుడ్ నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ హీరో దొరికితే మాత్రం సినిమా చేయడానికి కరణ్ జోహార్ ఎప్పటి నుంచో సిద్దంగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేసే హీరోల మీద దృష్టి పెట్టి వాళ్ళ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. అవసరమైతే సినిమా ప్రి రిలీజ్ మార్కెట్ మొత్తం హీరో కి దర్శకుడికి ఇవ్వడానికి బాలివుడ్ నిర్మాతలు సిద్దంగా ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version