గుడ్ న్యూస్‌.. ఆధార్, పాన్ అనుసంధానానికి గడువు పొడిగింపు..

-

పాన్ కార్డు ఉందా? అలాగే ఆధార్ కార్డు కూడా కలిగి ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్‌. ఎందుకంటే.. పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ గడువును పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు పెంచుతున్నట్లు పొడిగించినట్లు తెలిపింది. డిసెంబర్‌ 31 లోగా పాన్‌ను ఆధార్‌తో జత చేసుకోవాలని లేదంటే ఆది క్యాన్సిల్ అవుతుందని గతంలో పేర్కొంది. అయితే తాజా గడువు పెంచుతున్నట్లు పేర్కొంది.

పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి మరోమూడు నెలలు పెంచింది. ఈ మార్చి నెలాఖరులోపు రెండింటినీ జతచేయడం చేయకపోతే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 139ఏఏ ప్రకారం పాన్‌ కార్డును రద్దు చేస్తారు. కాగా, సీబీడీటీ ఆధార్, పాన్ అనుసంధాన గడువును పొడిగించడం ఇది వరుసగా 8వ సారి కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వపు ఆధార్ కార్డు రాజ్యంగబద్ధంగా అర్హత కలిగి ఉందని పేర్కొంది. దీంతో కేంద్రం ఆధార్, పాన్ నెంబర్లను లింక్ చేసుకోవాలి కోరుతూ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version