దేశ రాజధానిలో ఢిల్లీలో బాంబ్ పేలుడు కలకలం రేపింది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లోని పీవీఆర్ సినిమా హాల్ వద్ద గురువారం ఉదయం 11.48 గంటల ప్రాంతంలో భారీ పేలుడు శబ్ధం వినిపించింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది.
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న టైంలోనే బాంబు పేలడం పలు అనుమానాలకు తావిస్తోంది.సరిగ్గా నెల రోజుల క్రితం ప్రశాంత్ విహార్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు సంభవించిన తర్వాత నేడు మళ్లీ అదే ప్రాంతంలో పేలుడు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక కుట్రదారులు ఎవరు? ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.