కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్న విమానాలకు బెదిరింపు కాల్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి బ్యాంకాక్ వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని వెంటనే హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. డాగ్ స్వ్కాడ్ సాయంతో విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. చెకింగ్ అనంతరం విమానం సురక్షితం అని అధికారులు తేల్చారు.
బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని నిర్దారించారు. అనంతరం ప్యాసింజర్స్‌కు సమాచారం అందించారు. శనివారం ఉదయం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్యాసింజర్స్‌ను వెంటనే కిందకు దించేసి తనిఖీలు నిర్వహించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. కాగా, బెదిరింపు కాల్స్ వలన ఇండియన్ ఎయిర్ పోర్టు అథారిటీతో పాటు విమానాయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.