డీజీపీ తాడేపల్లి ఆదేశాలతోనే దేవాలయలపై దాడి కేసును రాజకీయ కక్ష సాధింపు కేసుగా మారుస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. అసలైన నిందితుల లిస్ట్ పోలీసుల దగ్గర వున్న వైసీపీ ఒత్తిడితో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. హిందూ దేవాలయలలో కూడా మత మార్పిడులు చేస్తుండడం దారుణం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్టంలో విచ్చలవిడిగా మతమార్పిడులు పెరిగాయి అనేది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు.
ఎప్పుడూ లేని విధంగా జగన్ పాలనలో కొందరు ఐపీఎస్ లు, వైపీఎస్ లుగా మారారని ఆయన అన్నారు. సలహాదారుల ఆదేశాలను తుచా తప్పక పాటిస్తున్నారని ఆయన అన్నారు. అనేక సార్లు కోర్టులు చివాట్లు పెట్టినా రాష్ట్రంలో లా & ఆర్డర్ ఎక్కడ లేకపోయినా పట్టించు కోని ఐపీఎస్ లు సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యలను పెడితే అరెస్టులు మాత్రం చేస్తున్నారని ఆయన అన్నారు.