జపాన్ లో గ్రామాలకు గ్రామాలు కాళీ అయిపోతున్నాయి… ఎందుకు ఇలా…?

-

అభివృద్ధి చెందిన దేశాల్లో, వేగంగా పరుగులు పెట్టె దేశాల్లో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. ఆ దేశంలో ఎక్కువగా ప్రజలు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు కోరుకుంటూ ఉంటారు. ప్రపంచం… జపాన్ తో పరుగులు పెట్టాలి అనేది వారి కోరికగా ఉంటుంది. ఇలాంటి జపాన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆ దేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. గ్రామాలకు గ్రామాలు కాళీగా దర్శనం ఇస్తున్నాయి… లేదా ముసలి వాళ్ళతో ఉంటున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది…? సాధారణంగా జపాన్ లో జనాభా నియంత్రణ మీద అక్కడి ప్రభుత్వం.

కాస్త గట్టి పట్టుదలగా వ్యవహరించడంతో జనాభా అదుపులోకి వచ్చింది. అక్కడి నుంచి అది మరో మార్గంలోకి వెళ్ళడం మొదలుపెట్టింది. కొత్తగా పెళ్ళైన దంపతులు పిల్లలను కనడం మీద శ్రద్ద చూపించడం లేదట. దీనితో గత అయిదేళ్ళలో జననాల రేటు అక్కడ భారీగా పడిపోయిందని కొన్ని కథనాలు వచ్చాయి. ఇక గ్రామాల్లో అయితే యువత ఎవరూ ఉండటం లేదట. వ్యవసాయం చేసే వారే లేకపోయారని అక్కడి వృద్దులు వాపోతున్నారు. చాలా వరకు గ్రామాల్లో యువకులు లేక ఊళ్లకు ఊళ్లు కాళీ అయిపోతున్నాయి.

వ్యాపారాలు, ఉద్యోగాలు అంటూ యువత పట్టణాలకు వెళ్ళడం, అక్కడే వివాహాలు చేసుకుని స్థిరపడిపోవడం వంటివి చేస్తున్నారు. ఇక వారికి పిల్లల మీద కూడా శ్రద్ధ ఉండటం లేదట. దీనితో అక్కడ జనాభా భారీగా తగ్గిపోతుంది. 2018-19 లో అయితే జననాల రేటు అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేసింది. సాంకేతికత విషయంలో ఎంతో వేగంగా ఉండే ఆ దేశం ఇలా జనాలు లేక బోసి పోయే పరిస్థితికి వచ్చింది. దీనితో ఇప్పుడు జనాభాను పెంచే కార్యక్రమాలను జపాన్ ప్రభుత్వం చేపడుతుంది. మరి ఇది ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version