భారతీయ ఐటీ ఉద్యోగులకు షాకులిస్తున్న ట్రంప్ సర్కారు.. పెద్ద ఎత్తున వీసాల తిరస్కరణలు..!

-

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ ఐటీ ఉద్యోగులు అక్కడ ఉద్యోగం చేసేందుకు గాను చేసుకుంటున్న హెచ్-1బీ దరఖాస్తులను ట్రంప్ సర్కారు పెద్ద ఎత్తున తిరస్కరిస్తోందట.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఐటీ ఉద్యోగులకు షాకులిస్తున్నారు. అమెరికాలో ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులకు కాకుండా అక్కడి స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని ట్రంప్ ఎన్నికల హామీ ఇచ్చి అమెరికా అధ్యక్షుడిగా పీఠం ఎక్కగా.. ఇప్పుడు ఆయన ఆ హామీని 100 శాతం అమలు చేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసేందుకు గాను భారతీయ ఐటీ ఉద్యోగులు చేసుకుంటున్న హెచ్-1బీ దరఖాస్తులను ట్రంప్ సర్కారు పెద్ద ఎత్తున తిరస్కరిస్తోందని వెల్లడైంది.

యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ఆధారంగా హెచ్-1బీ వీసాలపై నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తాజాగా చేపట్టిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ ఐటీ ఉద్యోగులు అక్కడ ఉద్యోగం చేసేందుకు గాను చేసుకుంటున్న హెచ్-1బీ దరఖాస్తులను ట్రంప్ సర్కారు పెద్ద ఎత్తున తిరస్కరిస్తోందట. ఈ క్రమంలోనే మన దేశంలోని టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు చేసిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 4 నుంచి 45 శాతం వరకు తిరస్కరణకు గురయ్యాయని వెల్లడైంది.

2010 నుంచి 2015 మధ్య హెచ్-1బీ వీసా రిజెక్షన్స్ శాతం 8 మాత్రమే ఉండగా, ఇప్పుడది మూడు రెట్లు పెరిగి 24 శాతానికి చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ సర్కారు భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుందని అర్థమవుతుంది. మరి ముందు ముందు ఇది ఏయే పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version