చంద్రబాబు సహనం కోల్పోయి, నోటీకి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు : బొత్స సత్యనారాయణ

-

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధ కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటి వరకు కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ నేపథ్యంలో రోడ్‌షోలు నిర్వహించారు. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని అన్నారు. చంద్రబాబు సహనం కోల్పోయి, నోటీకి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని మంత్రి బొత్స విమర్శించారు. చంద్రబాబు మాటలు చాలా నీచంగా ఉంటున్నాయని అన్నారు మంత్రి బొత్స.

సమాజం హర్షించని విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. జనాలు వైసీపీ వెనుక ఉన్నారనే చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని అన్నారు మంత్రి బొత్స. మాట్లాడటం మాకు కూడా వచ్చని… అయితే రాజ్యాంగాన్ని గౌరవించి తాము అలా మాట్లాడటం లేదని చెప్పారు. చంద్రబాబులా పబ్లిసీటీ కోసం మాట్లాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ప్రజలకు తాము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని… ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకుంటే చాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి సభను వైసీపీ కార్యకర్తలంతా కలిసి విజయవంతం చేయాలని కోరారు మంత్రి బొత్స.

Read more RELATED
Recommended to you

Exit mobile version