ఉపాధి హామీ కూలీలకు దొరికిన వెండి నాణెల బాక్స్.. !

-

సాధారణంగా ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఎక్కడ గుప్త నిధులు లభిస్తాయి.. ఎక్కడ లాభం వస్తుంది..? ఎక్కడ నష్టం వస్తుందని అంచెనా వేసుకుంటూ పని చేస్తుంటారు. గుప్త నిధుల వల్ల వాళ్లు కోటీశ్వరులు అయ్యారు.. వీరు ఇంత సంపాదించుకున్నారు..? మనం కూడా గుప్త నిధులను సేకరిస్తే.. కోటీశ్వరులు అవ్వొచ్చనే ఉద్దేశంతో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పాటుపడిన బావులు, ఆలయాలు కనిపిస్తే.. చాలు అక్కడ గుప్త నిధులు లభిస్తాయని వేట మొదలు పెడుతారు.

తాజాగా సిద్దిపేట జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఓ పొలాన్ని చదును చేస్తుండగా.. వారికి రాయితో చేసిన బాక్స్ కనిపించింది. మొదట వారంతా దానిని తెరిచేందుకు భయపడ్డారు. ఎలాగోలా తెరచి చూడగా.. అందులో 25 వెండి నాణేలు ఉన్నాయి. అదేవిధంగా వెండితో చేసిన రెండు ఉంగారాల కూడా లభ్యమయ్యాయి. ఈ విషయంలో అందరి నోట్లో పడటంతో ఊరుఊరంతా ఆ నాణేలను చూసేందుకు ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version