నిజామాబాద్ జిల్లాలో ఒక యువకుడి ప్రాణం తీసింది వీడియో చాటింగ్. అసలు పరిచయం లేని అమ్మాయితో వీడియో కాల్స్ చేసిన శ్రీకాంత్ అనే యువకుడు ఆ వీడియో కాల్స్ వలన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె కోరడంతో నగ్న వీడియోలు షేర్ చేస్తూ వారి ట్రాప్ లో పడిపోయాడు. దీంతో నగ్న వీడియోలు తన వద్ద ఉంచుకుని శ్రీకాంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఒక కిలాడీ లేడీ టార్చర్ చూపించింది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోస్లీకి చెందిన శ్రీకాంత్ ను ఒక కిలాడీ లేడీ ట్రాప్ చేసింది. అతని నగ్న వీడియోలు బయట పెట్టకుండా ఉండాలంటే లక్షల రూపాయల నగదు తమకు ఇవ్వాలంటూ ఆమె బెదిరించింది. వీడియోలతో పరువు పోతుందని భావించి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.