భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. స్క్రూ డ్రైవర్ మింగిన బాలుడికి.. సర్జరీ చేసి వెలికితీశారు వైద్యులు. ఆడుకుంటూ 6 సెం.మీ స్క్రూ డ్రైవర్ ను గౌతమ్ అనే బాలుడు మింగేశాడు. అది పేగులో ఇరుక్కుపోవడంతో నొప్పితో బాలుడు విలవిలలాడాడు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఈ తరుణంలోనే…. ఆ బాలుడికి సర్జరీ చేసిన వైద్యులు… సక్సెస్ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి స్క్రూడ్రైవర్ బయటికి తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు వైద్యులు. బాలుడి స్వస్థలం ఏపీలోని అల్లూరి జిల్లా అని వైద్యులు వెల్లడించారు.