Brahmaji: అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. బ్రహ్మాజీపై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్!

-

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ‘ఆంటీ’ అనే హ్యాష్‌ట్యాగ్ షేక్ చేస్తోంది. లైగర్ సినిమా రిలీజ్ రోజు యాంకర్ అనసూయ వేసిన ట్విట్‌పై దుమారం రేగింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ తప్పకుండా వెంటాడుతుందని ట్విట్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమా అప్పుడు విజయ్ అభిమానులకు అనసూయకు మధ్య పెద్ద వివాదం నడిచింది. ఇటీవల విడుదలైన లైగర్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో పరోక్షంగా ప్రస్తావిస్తూ అనసూయ చేసిన ట్విట్ వైరల్ అయింది.

నటుడు బ్రహ్మాజీ

తాజా అంకుల్ వివాదం తెరపైకి వచ్చింది. నటుడు బ్రహ్మాజీ చేసిన ట్విట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. వాట్ హ్యాపెనింగ్ అంటూ బ్రహ్మాజీ ట్విట్టర్‌లో ఓ ఫోటో పెట్టాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ఏం లేదు అంకుల్’ అని పోస్టు చేశాడు. దీంతో బ్రహ్మాజీ ఫన్నీగా స్పందిస్తూ.. ‘అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్ బాడీ షేమింగ్’ అంటూ ఫన్నీ ఎమోజీని షేర్ చేశాడు. అయితే ఇది యాంకర్ అనసూయకు కౌంటర్‌గా బ్రహ్మాజీ ట్విట్ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version