బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ ను ఒక స్థాయిలో పొగిడేశాడు.. ఏకంగా దైవాంశ సంభూతుడు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు, ఇంకా బ్రహ్మనందం పవన్ గురించి ప్రజల కోసం అన్నీ వదిలేసి వచ్చాడంటూ కామెంట్స్ చేయడంతో , మీడియా సంస్థలు బ్రహ్మానందం త్వరలోనే జనసేన లోకి చేరనున్నారంటూ వార్తలు రాశారు. కానీ దీని గురించి ఎక్కడా కూడా అధికారికంగా బ్రహ్మనందం ప్రకటన చేసినట్లు కానీ , లేదా పవన్ చెప్పినట్లు కానీ లేదు. అయితే గతాన్ని ఒకసారి పరిశీలిస్తే … వాస్తవంగా చూస్తే రాజకీయాలు అంటే బ్రహ్మానందం కు అస్సలు పడవు, వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని తెలిసిందే. ఇక గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా పార్టీలోకి ఎందరో ఆహ్వానించినా పార్టీలో చేరకపోయినా ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని ప్రత్యక్షముగా రాజకీయాల్లోకి రాదని తెలుస్తోంది.
“జనసేన”లోకి హాస్యబ్రహ్మ ? గతం ఏమి చెబుతోంది !
-