ఎన్నో కుటుంబాల ఉసురు పోసుకున్న నీచుడు చంద్రబాబు : మంత్రి రోజా

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు జీవితాంతం చిప్పకూడే గతి అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు కాదు.. బాబు అడ్డంగా దొరికిపోయిన కేసు అని రోజా చెప్పుకొచ్చారు. ఎన్నో కుటుంబాల ఉసురు పోసుకున్న నీచుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసిన పాపాలే జైలుకు దారిచూపాయన్నారు. ఏపీ ప్రజల సొమ్ముతో హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడు ప్యాలెస్ నిర్మించారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని మంగళవారం వీఐపీ విరామ సమయంలో రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్ళుగా వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తూ, అవినీతికి పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబుకు శిక్ష విధించాలని తాను శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటె, తిరుపతి ప్రెస్ క్లబ్‌లో మీడియా ముందు జనసేన పార్టీ నాయకులు కొండా రాజమోహన్, హేమ కుమార్, రాజేష్ ఆచారి , వంశీ , కిషోర్ , దుర్గ, చందన తదితరులతో కలిసి జోస్యంకు సంబంధించిన వస్తువులను మీడియా ముందు ప్రదర్శించి, వైసీపీ నేతల భవిష్యత్తు చెప్పారు. రోజాకు భవిష్యత్తులో చిలక జోస్యమే గతి అని హెచ్చరిస్తూ హాస్య భరితమైన చురకలు విసిరారు. టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ పాలకులు పెట్టిన అక్రమ కేసులు, తద్వారా జైలుకు పంపిన వ్యవహారంపై మంత్రి రోజా బాణాసంచాలు పేల్చి స్వీట్లు పంచడాన్ని తప్పుపట్టారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడితే రాబోయే ఆరు నెలల తరువాత వైసీపీ ప్యాకప్, జగన్మోహన్ రెడ్డి లాకప్, రోజాకు మేకప్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version