బ్రేకింగ్ : తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెనింగ్ కు బ్రేక్ !

-

తెలంగాణలో విద్యా సంస్థల రీఓపెనింగ్ కు తాత్కాలిక బ్రేక్ పడింది. పాఠశాల ప్రారంభం పై వారం పాటు స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. రేపటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలి అనుకున్నా తెలంగాణ ప్రభుత్వానికి… హైకోర్టు స్టే తో ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు లో విచారణ జరిగింది. అన్ని వైద్య సదుపాయాలు ఉన్న అమెరికాలో రోజుకి లక్ష కేసులు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా పిటిషనర్ కోర్టు కు వివరించారు.

భారత దేశంలో వైద్య సదుపాయాలు లేవని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో కూడా అదే పరిస్థితి ఉందన్న పిటీషనర్.. చిన్నపిల్లలను పాఠశాలకు పంపే ముందు తల్లిదండ్రులు అండర్ టేకింగ్ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక అటు UNICEF పాఠశాల తప్పనిసరిగా ఓపెన్ చేయాలి అని చెప్పిందన్న ఏజీ… చాలామందికి స్కూల్లో న్యూట్రిషన్ ఫుడ్ మిస్ అవుతున్నారని కోర్టుకు తెలిపారు.. స్కూల్లో ఆహార సరఫరా పై డీఈఓ నేతృత్వంలో పర్యవేక్షణలో చేస్తామని సర్కార్ తరఫున తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ లో కోవిడ్ తీవ్రస్థాయిలో వినిపిస్తుందని నివేదిక అందించిన డబ్ల్యూహెచ్ఓ కు ఎం చెపుతారని తెలంగాణ సర్కార్ ను హైకోర్టు ప్రశ్నించింది.

కోవిడ్ టీక పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు ఏవిధంగా వ్యాక్సిన్ లేకుండా పాఠశాలలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించింది హైకోర్టు. ఒకవేళ స్కూల్స్ లో ఉన్న పిల్లలకు ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అన్న హైకోర్టు.. చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు.. అలాంటప్పుడు అటువంటి పరిస్థితి లో పాఠశాలల మేనేజ్మెంట్ వారి భరిస్తుందా అని నిలదీసింది.

ఒకవేళ మీరు స్కూల్ తెరవక పోతే మేనేజ్మెంట్ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న హైకోర్టు.. పిల్లలను స్కూల్స్ కు పంపకపోతే కూడా తల్లిదండ్రుల పైన ఏమైనా చర్యలు తీసుకునే అధికారం మీకు ఉందా అని ప్రశ్నించింది. మీరు ఇచ్చిన జీవో మేనేజ్మెంట్ మీద గాని పిల్లల తల్లిదండ్రుల మీద గానీ ఎటువంటి చర్యలు తీసుకుంటామని మీ జీవో చెప్పలేదని పేర్కొంది హైకోర్టు.. ప్రభుత్వము ఫిజికల్, వర్చువల్ గా క్లాసు నిర్వహిస్తుందా అని ప్రశ్నించింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే.. పాఠశాల ప్రారంభం పై వారం పాటు స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాల తో వచ్చిన అనంతరం… విద్యా సంస్థల పునః ప్రారంభం పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version