తాజాగా తమిళనాడు బీజేపీకి భారీ షాక్ తగిలింది, ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు మరియు సినీ నటి గౌతమి ఈ ఉదయమే పార్టీకి రాజీనామా చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం తనను వ్యక్తిగతంగా మోసం చేసిన వ్యక్తిని బీజేపీ ఆదరిస్తుండడమే కారణమని ఈము తెలిపింది. గౌతమి చెప్పిన వివరాల ప్రకారం 20 సంవత్సరాల క్రితం నా ఆస్తులను పరిరక్షించడానికి పెట్టుకున్న వ్యక్తి అళగప్పన్.. కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత తనను మోసం చేశాడంటూ ఆమె కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంలో బీజేపీలోని సీనియర్లు తనకు సహకరించాల్సింది పోయి పొరపాటు చేసిన అళగప్పన్ కు సపోర్ట్ చేస్తున్నారు అంటూ గౌతమి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు బీజేపీ తమిళనాడు నాయకత్వం మరియు అధినాయకత్వం ఈ విషయంలో గౌతమి తో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా లేదా అలాగే వదిలేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.
దేశంలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేయడం ప్రజల్లో వ్యతికరేకతను పెంచే అవకాశం ఉంది.