అర్నబ్ గోస్వామిపై మరో కేసు నమోదు చేసారు. నవంబర్ 4 న తనను అరెస్టు చేయడానికి… లోయర్ పరేల్ నివాసానికి వెళ్లిన అలీబాగ్ పోలీసు అధికారిపై దాడి చేశాడనే ఆరోపణలతో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిపై మరో కేసు నమోదు అయింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులో సెషన్ కోర్టు ముందు ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్పీల్ చేసారు.
ఒక మహిళా పోలీసు అధికారిపై దాడి చేసినందుకు కేసు నమోదు చేశారు. 2018 లో ఆర్కిటెక్ట్-ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ మరియు అతని తల్లి ఆత్మహత్య కేసులో ఆయనను ఈ నెల మొదట్లో అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళా పోలీసు అధికారిపై దాడి చేశాడనే ఆరోపణలతో గోస్వామిపై ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ కేసులో ఐపిసి సెక్షన్లు 353 (ప్రభుత్వ అధికారిని తన విధులను నిర్వహించకుండా అడ్డుకోవడం), 504, 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదు చేసారు.