గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ఎన్నికల నిర్వహణపై అందుబాటులో ఉండే మంత్రులతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. దుబ్బాక ఫలితాల నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇక మేయర్ పీఠమె లక్ష్యంగా ప్రధాన పార్టీలు అన్నీ ఎన్నికల మీద దృష్టి సారిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరో వైపు ఒకటి రెండు రోజుల్లో క్యాబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది. నిజానికి జిహెచ్ఎంసి పాలకమండలికి వచ్చే ఫిబ్రవరి 10 దాకా గడువు ఉండగా అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఎన్నికల షెడ్యూలు పై గతంలో కొంత అస్పష్టత ఉండగా దుబ్బాక ఎన్నికల ఫలితం తోటి జిహెచ్ఎంసి ఎన్నికలలో ప్రత్యర్ధి పార్టీల కంటే ముందే ఎన్నికలు పూర్తి స్థాయిలో సిద్దం కావాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు కనబడుతోంది.