గ్రూప్-1 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన పరీక్షలకు అన్ని రకాల ప్రక్రియలను పూర్తిచేసుకుని ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్ వన్ పరీక్షా ఫలితాల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని అన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తున్నామన్నారు. 167 పోస్టుల భర్తీకి లక్షన్నరకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు అని తెలిపారు. 325 మంది ఇంటర్వ్యూ వరకు వచ్చారని అన్నారు. కోర్టు తీర్పుకు లోబడే ఈ ఫలితాలు వర్తిస్తాయి అన్నారు.
మొత్తంగా 167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఉండగా.. 165 స్థానాలను భర్తీ చేసింది ఏపీపీఎస్సీ. ఇందులో మరో రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేసింది.” డిప్యూటీ కలెక్టర్లు- 30, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ 08, డీఎస్పీలు 27, డీఎస్పీ (జైల్ల శాఖ) 1, డీఎఫ్ఓ 1, అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు 11, ఆర్డీవోలు 5, అసిస్టెంట్ ప్రొహిబిషన్ 1-06, మల్టీ జోన్ 2-05, ఎంపీడీవోలు 47, జిల్లా రిజిస్టర్లు 01, జిల్లా ఉపాధి కార్యాలయం 02, సహకార శాఖలో డిప్యూటీ రిజిస్టర్స్ 01,( జోన్-2),01 ( జోన్ 3), జిల్లా గిరిజన అధికారి 01,ఎస్సీ సంక్షేమ అధికారి 01,బీసీ సంక్షేమ అధికారి 01,డిపిఓ 01,గ్రేడ్ 2 మునిసిపల్ కమిషనర్లు 1, ఏపీ వైద్యారోగ పరిపాలన శాఖలో అడ్మినిస్ట్రేటివ్ అధికారులులు-మల్టీజోన్ 1-06, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 02(జోన్ 3),04(జోన్ 4).గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన వారిలో 67 మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారు.తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణిసుష్మిత టాప్ వన్ లో నిలువగా.. రెండో స్థానంలో కే శ్రీనివాసరాజు, మూడో స్థానంలో హైదరాబాద్ కు చెందిన సంజనా సింహా నిలిచారు.