హిందూ దేవుళ్ళు, అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. అతడిని వరంగల్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నరేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నరేష్ ని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బైరి నరేష్ అరెస్టుపై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. నరేష్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించుకోవాలని ఎస్పీ కోరారు. ఎవరైనా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఇలాంటి వాటి ప్రోత్సహించవద్దని సూచించారు. మత విద్వేషాలను ఉపేక్షించేది లేదన్నారు ఎస్పీ కోటిరెడ్డి.