ఈ నెల 23వ తేదీన మాస్ మహారాజా రవితేజ శ్రీ లీల జంటగా నటించిన ధమాకా చిత్రం ప్రేక్షకులు ముందుకి వచ్చింది తొలి రోజు నుంచి హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది అయితే తాజాగా దీనికి సంబంధించిన సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం.
ధమాకా చిత్రం విడుదలైన రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది.. అలాగే ధమాకా చిత్రం తొలి రోజే 10 కోట్లకి పైగా గ్రాస్ ను చూసిన ఈ సినిమా, రెండో రోజున 20 కోట్లకు పైగా వసూలు చేసింది ఇలా ఐదవ రోజుకి 49 కోట్లను రాబెట్టింది.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ను మాస్ మీట్ పేరుతో ఏర్పాటు చేశారు చిత్ర బృందం.. ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు, హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు.. “సాధారణంగా గెస్టుగా ఎవరినైనా పిలిస్తే, చాలా బిజీగా ఉన్నప్పటికీ రాక తప్పలేదని చెబుతుంటారు. కానీ నిజానికి నేను అంత బిజీగా ఏమీ లేను. పైగా పిలవకపోయినా వచ్చాను. 5 వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు ఫ్లూట్ ఊదితే 16 వేల మంది గోపికలు వచ్చారు. పీపుల్ మీడియా వారు కూడా అలాంటి ఫ్లూట్ ఏదో ఊదే ఉంటారు .. అందుకే డబ్బులే డబ్బులు. నాకు తెలిసి ఆ ఫ్లూట్ వాళ్ల ఆఫీసులో ఉందని అనుకుంటున్నాను. ఆ ఫ్లూట్ ను నిర్మాతల ఆఫీసు నుంచి దొంగతనంగా తీసుకురావలసిన బాధ్యత శ్రీలీలదే. ఆ ఫ్లూట్ ను ఒకసారి మా ఆర్కే ఆఫీసులో కూడా ఊది చూడాలి. ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. నా చిన్నప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నాడు” అంటూ నవ్వులు పూయించారు..