తెలంగాణాలో మావోల హడావుడి నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. టీఆర్ఎస్ నేతను దారుణంగా ములుగు జిల్లాలో మావోలు హతమార్చారు. దీనితో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ భారీ భద్రతను అధికార పార్టీ నేతలకు ఏర్పాటు చేసారు. అయితే స్థానిక ప్రజా ప్రతినిధులను మావోలు చంపేసే అవకాశం ఉండటంతో డీజీపీ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణా సిఎం కేసీఆర్ నేడు లేదా రేపు అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీలతో ఆయన సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు ఇచ్చే సూచనలు ఉన్నాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు భద్రతను పెంచే అవకాశం ఉంది. మంత్రులు గిరిజన ప్రాంతాల్లో పర్యటనలు రద్దు చేసుకోవాలని నిఘా అధికారులు హెచ్చరిస్తున్నారు.