బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులను కరోనా భయం వెంటాడుతుంది. ఇటీవల కేసు టేకప్ చేసిన సిబిఐ ఇప్పుడు కేసు విచారణలో దూకుడుగా ఉంది. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ బృందాన్ని డిసిపి త్రిముఖే ఇటీవల కలిశారు. అభిషేక్ త్రిముఖే తన కుటుంబ సభ్యులతో పాటు కరోనా బారిన పడ్డారు.
ఆయన ఈ కేసు విచారణలో ముందు నుంచి ఉన్నారు. ఈ క్రమంలోనే కేసు విచారణ వివరాలను అందించారు. అయితే సిబిఐ అధికారులు కరోనా పరిక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని స్వయంగా నిర్ణయించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చెప్పారు. ఇప్పటికే సిబిఐ అధికారులకు క్వారంటైన్ మినహాయింపుని కూడా ఇచ్చారు. కాగా బీహార్ ఐపిఎస్ అధికారి వినయ్ తివారీ, రూల్ బుక్ పాటించలేదని ఆరోపిస్తూ బిఎంసి నిర్బంధించింది.