ఈ రోజు దసరా మరియు విజయదశమి పండుగలను పురస్కరించుకుని వరుసగా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మరియు OG ల నుండి అప్డేట్స్ రాగా, తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి సూపర్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే విడుదల చేస్తామంటూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో మహేష్ బాబు కారు డిక్కీలో కూర్చుని స్టైల్ గా బీడీ కాలుస్తున్నాడు, కానీ అప్పటికే ఒక రౌడీ ని కొట్టి కింద కూర్చోపెట్టేశాడు.. కారుకు ఒక వేట కత్తి కూడా గుచ్చుకుని ఉంది. ఈ పోస్టర్ ను చూస్తే ఒక మంచి ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్ అని అర్ధమవుతోంది.
ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి జనవరి 12 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.