BREAKING: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

-

వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ పోలీసులు పాదయాత్రకు అనుమతించడం లేదని షర్మిల హైకోర్టులో లంచ్ మోచన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గతంలో ఇచ్చిన షరతులు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది.

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని లింగగిరి లో ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని షర్మిల పోలీసులను కోరగా శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని పోలీసులు పాదయాత్రకి అనుమతి నిరాకరించారు. దీంతో ఆమె హైకోర్టుని ఆశ్రయించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version