నేడు సచివాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 8వ తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ అందించే పథకానికి ఆమోదం తెలపగా.. ఈ పథకం కింద విద్యార్థులకు ట్యాబులను మంత్రులే ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఇక గడపగడపకు కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లా అధ్యక్షులతో కలిసి సమస్యలను పరిష్కరించాలని.. అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. ఇక దుష్ట చతుష్టయం తీరుపై క్యాబినెట్ లో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రజలకు మేలు చేస్తున్నప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారని.. మంత్రులు పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు.పార్టీ లో నేతల మధ్య విభేదాలుంటే ఇంచార్జ్ మంత్రులు పరిష్కరించాలని సూచించారు.