ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనలో ఇప్పటికే అనేక సంచలనాలు నమోదు చేస్తున్న ఏపీ సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు గ్రామాల పర్యటనకు సిద్దమయ్యారు. ఆగస్ట్ నెల నుంచి ఆయన గ్రామాల్లో పర్యటిస్తారు. గ్రామాల్లోని ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. రాజకీయంగా వస్తున్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి గానూ ఇప్పుడు ఆయన గ్రామాల పర్యటనకు వెళ్తున్నట్టు తెలుస్తుంది.
రాజకీయంగా క్షేత్ర స్థాయిలో తప్పులు జరుగుతున్నాయని, అది తన ఇమేజ్ ని దెబ్బ తీస్తుంది అనే భావన లో సిఎం వైఎస్ జగన్ ఉన్నారు. అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయన గ్రామాల పర్యటనకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల పర్యటనకు సంబంధించి నేడు జరిగిన కేబినేట్ సమావేశంలో కూడా సిఎం జగన్ ప్రస్తావించగా మంత్రుల నుంచి కూడా సానుకూల ప్రకటన వచ్చింది.
గతంలో వైఎస్ బ్రతికి ఉన్న సమయంలో గ్రామాల్లో పర్యటించారు. సిఎం గా రచ్చబండ వంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల సమస్యలకు ఆయన అక్కడిక్కడే పరిష్కారం చూపించే వారు. ఇప్పుడు సిఎం జగన్ కూడా అదే విధంగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను స్వయంగా పరిష్కరించడమే కాకుండా వారితో నేరుగా మాట్లాడే ఆలోచనలో కూడా ఉన్నారు.