బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం హైకోర్టును ఆశ్రయించారు.గతంలో బంజారాహిల్స్,ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్లలో తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్స్ దాఖలు చేశారు. ఎటువంటి కారణాలు లేకుండానే తనపై కేసులు పెట్టారని ఆయన పిటిషన్స్‌లో పేర్కొన్నారు.
బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించడంతో.. ఆయనపై కాంగ్రెస్ నేతలు ఈ కేసులు పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్స్‌ను కేటీఆర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ పిల్స్ మీద కోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.