బ్రేకింగ్: నేడు భారత్ చైనా మధ్య మరోసారి సైనిక చర్చలు

-

భారత్ చైనా సరిహద్దుల్లో నేడు మరోసారి రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల సైనికులు నేడు మరోసారి సమావేశం అవుతారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత మరియు చైనా సైన్యాల సీనియర్ కమాండర్లు తూర్పు లడఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌లో సమావేశమవుతున్నారని ఆర్మీ పేర్కొంది. ఈ చర్చలు చాలా కీలకం అని పేర్కొంది ఆర్మీ.

india-china

ఇప్పటి వరకు 5 రౌండ్ల చర్చలు జరగగా ఇది ఆరో రౌండ్ చర్చలు. ఇవి సుదీర్ఘంగా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపింది ఆర్మీ. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అభిజిత్ బాపాట్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. చర్చల యొక్క ప్రధాన ఎజెండా ఏమిటంటే, డెప్సాంగ్ వద్ద చైనా భారీ బలగాలను మోహరించింది. 15 వేలకు పైగా చైనా బలగాలు ఇక్కడ ఉన్నాయి. చైనా సైన్యం ట్యాంకులు, ఫిరంగి తుపాకులతో పాటు డెప్సాంగ్ ఎదురుగా భారీ సంఖ్యలో దళాలను మోహరించింది. భారత్ కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version