వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా సూపర్ సిక్స్ మ్యాచ్ లలో భాగంగా వెస్ట్ ఇండీస్ మరియు స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది విండీస్. రెండు సార్ల ఐసీసీ వరల్డ్ కప్ ను గెలుచుకున్న ఈ జట్టు ఒక అనామక జట్టుపై ఓడిపోవడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు కేవలం 181 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో ఆల్ రౌండర్ బ్రాండన్ మెక్ ముల్లెన్ బౌలింగ్ లో మూడు వికెట్లు మరియు బ్యాటింగ్ లో 69 పరుగులు చేసి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
బ్రేకింగ్ న్యూస్: ఛాంపియన్ ను వరల్డ్ కప్ నుండి తరిమేసిన స్కాట్లాండ్..
-