కరోనా బారిన పడిన భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇప్పుడు అత్యంత్ విషమగా ఉంది అనే వార్తలు కలవరపెడుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రణబ్ కు చికిత్స చేస్తున్న ఆర్మీ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. నిన్నటి నుంచి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది అని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేసారు.
ఊపిరితిత్తుల సంక్రమణ కారణంగా సెప్టిక్ షాక్‌లో ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి ప్రకటన చేసింది. నిపుణుల బృందం ఆయనకు వైద్యం అందిస్తుంది అని పేర్కొన్నరు. ఆయన డీప్ కోమా & వెంటిలేటర్ సపోర్ట్ లో కొనసాగుతున్నారని ఆర్మీ హాస్పిటల్ (ఆర్ అండ్ ఆర్) పేర్కొంది. ఈ నెల 5 న ఆయన కరోనా బారిన పడి ఆర్మీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఆరోగ్యం విషమంగానే ఉంది.