బ్రేకింగ్ : సింగర్ కల్పన హెల్త్ బులిటెన్ విడుదల..

-

నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన సింగర్ కల్పన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. కానీ, శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులున్నా వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కల్పన ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు తీసుకున్నట్లు ఆమె సన్నిహితులు చెప్పారని.. వెంటనే ట్రీట్మెంట్ అందించామన్నారు. మంగళవారం రాత్రి కల్పనకు స్టమక్ వాష్ చేశామని,లంగ్స్‌లో వాటర్ చేరడంతో వెంటిలేటర్ పెట్టామన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారని, కల్పన ఆరోగ్యం ప్రస్తుతం స్టేబుల్ గా ఉందని వివరించారు. తనకు కాస్త ఇన్ఫెక్షన్ ఉందని,ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నామని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news