చంద్రబాబు చేసేదంతా మోసం.. జగన్ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పేది, చేసిది అంతా మోసం అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్ లు ప్రవేశపెట్టింది. రెండింటిలోనూ ప్రజలను మోసం చేసినట్టు వెల్లడించారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ.. మోసం గ్యారెంటీ అయింది. ఎన్నికలకు ముందు దత్తపుత్రుడితో కలిసి ఆయన ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు.

ముఖ్యంగా 20లక్షల ఉద్యోగాలు, 3వేల నిరుద్యోగ భృతి సహాయం అన్నారు. కానీ గత ఏడాది, ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. దీంతో ప్రతి నిరుద్యోగికి రూ.72వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకానమిక్ సర్వే ప్రకారం.. MSME సెక్టార్ లో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. బడ్జెట్ లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6లక్షలు.. ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 40లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. రైతు భరోసా పేరిట రైతన్నలను మోసం చేస్తున్నారని ఇలా ప్రతీ ఒక్కరినీ మోసం చేస్తున్నారని చంద్రబాబు అని ఆరోపించారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news