బ్రేకింగ్: తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేత మృతి…!

-

మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య తుది శ్వాస విడిచారు. జులై 29న అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన నంది ఎల్లయ్య, ఉదయం 10.30 గంటలకు కన్ను మూసారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన ఆస్పత్రిలో చేరగా 10 రోజుల తర్వాత కరోనాగా నిర్ధారణ అయింది. దీనితో ఆరోగ్యం క్షీణించింది అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

5 సార్లు ఎంపీ గా 2 సార్లు రాజ్యసభ ఎంపీ గా ఆయన సేవలు అందించారు. ఆయన మరణంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. నంది ఎల్లయ్య మరణం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. నంది ఎల్లయ్య నీతి నిజాయితీ పరుడని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version